NDL: కోవెలకుంట్ల మండలం గుల్లదుర్తి సమీపంలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న సంజామలకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్లకు కారు ఢీకొంది. ఉయ్యాలవాడలో పదవ తరగతి పరీక్షల బందోబస్తు చూసుకొని, నొస్సం జడ్పీ హైస్కూల్ వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కానిస్టేబుల్లో మహేశ్వర్ రెడ్డికి కాలు విరగగా, రాంబాబుకు స్వల్ప గాయాలయ్యాయి.