చమురు ధరల పెరుగుదల అందరిపై ప్రభావం చూపనుంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా భారమై నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. మనం వాడే టూత్‌పేస్ట్, సబ్బులు, పాలిస్టర్ దుస్తుల తయారీలో పెట్రోకెమికల్స్ వాడతారు. ఈ క్రమంలో వాహనం లేకపోయినా చమురు ధరలు సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.