ASF: పెండింగ్లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా “బడాయిలు చాలించు – బకాయిలు చెల్లించు” అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని MLA డిమాండ్ చేశారు.