పాక్లో భారత గూఢచర్య నేపథ్యంతో వచ్చిన ‘ధురంధర్ 1 & 2’.. అక్కడి అధికారుల గుండెల్లో గుభేల్ అనిపిస్తున్నాయి. సినిమాలోని ట్విస్టులతో భారత్ కోసం ఎవరు గూఢచర్యం చేస్తున్నారో అనే ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరాచీలోని ల్యారీలో పోలీసులు ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. అనుమానం వచ్చినవారిని క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు.