MLG: జిల్లా కోర్టుకు బాంబు పెట్టినట్లు ఈమెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన జిల్లా కోర్టు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోర్టు భవనం నుంచి జడ్జి, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను బయటకు తరలించారు. బాంబు స్క్వాడ్‌తో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. కోర్టు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.