»Music Director Imman Says That Sivakarthikeyan Cheated Him And He Cant Work With Him
Imman: హీరో శివకార్తికేయ దారుణంగా మోసం చేశాడు
తమిళ హీరో శివకార్తికేయపై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనతో జీవితంలో పనిచేయనని వ్యాఖ్యానించారు. తనను దారుణంగా మోసం చేశాడని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
Music director Imman says that Sivakarthikeyan cheated him and he can't work with him.
Imman: తమిళ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్(Imman)ల కలయికలో అదిరిపోయే చార్ట్బస్టర్లు వచ్చాయి. శివకార్తికేయన్ నటించిన సీమ రాజా, రజనీ మురుగన్, నమ్మ వెట్టు పిల్లాలి వంటి పలు చిత్రాలకు ఇమ్మాన్ సంగీతం అందించారు. ఇకపై వీరి కాంబినేషన్లో ఎలాంటి పాట రాబోదని సంగీత దర్శకుడు ఇమ్మాన్ అంటున్నారు. శివకార్తికేయ తనను దారుణంగా మోసం(cheated ) చేసినట్లు ఆరోపణలు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పారు. ఇకపై హీరో శివకార్తికేయన్‌తో కలిసి పనిచేయనని అన్నారు.
అసలు వీరిద్దరి మధ్య ఉన్న సమస్య ఏంటో మాత్రం చెప్పలేదు. కానీ అతను ఒక విషయంలో మోసం చేసినట్లు చెప్పుకొచ్చారు. తన కుటుంబ సభ్యలతో కూడా తాను మంచిగా ఉంటానని పేర్కొన్నారు. జీవితంలో కొన్ని తప్పులను క్షమించగలం. కానీ వాటిని మర్చిపోలేమని, భవిష్యత్తులో నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రమే పనిచేస్తమేమో.. ఎప్పటికి స్నేహితుల్లా మాత్రం ఉండలేమని అన్నారు. ఇది ఒక క్రియేటీవ్ స్పేస్ అని అన్నింటిని మర్చిపోయి అతనితో కలిసి పనిచేయడం కష్టంగా ఉంటుందని తెలిపారు. ఇంతకీ ఏ విషయంలో ఇమ్మాన్ ఇంతలా హార్ట్ అయ్యాడో మాత్రం చెప్పలేదు. దీనిపై నేటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.