»Mehreen Pirzada Calling Rape Sex Scenes Is Hurtful
Mehreen Pirzada: ఆ సీన్లను శృంగార సీన్లు అనడం బాధాకరం
హీరోయిన్ మెహ్రీన్ తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాను నటించిన 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ' సిరీస్‌లోని అత్యాచారం సన్నివేశాన్ని కొందరు శృంగార సీన్లు అన్నారు. ఈ క్రమంలో మెహ్రీన్ అసహనం వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ నెట్టింట్ వైరల్ అవుతోంది.
Mehreen Pirzada: కృష్ణగాడి వీర ప్రేమగాథతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ(Sultan Of Delhi) అనే సిరీస్ ఇటీవల హాట్ స్టార్లోకి వచ్చింది. ఈ సిరీస్‌లో ఆమె ఓ అత్యాచార సన్నివేశంలో నటించింది. అయితే కొంత మంది ఈ సీన్ శృంగార సీన్‌గా భావించి మెహ్రీన్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై బాధపడుతూ ఆమె సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట్ హల్చల్ చేస్తోంది.
Recently I made my OTT Debut in the web series, “Sultan of Delhi” on Disney Hotstar. I hope my fans have enjoyed watching the series. Sometimes scripts demand certain actions which might go against your own morals. As a professional actor who considers acting an art and at the…
‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ(Sultan Of Delhi) అనే వెబ్ సిరీస్‌లో నటించాను. నా అభిమానులు ఈ సిరీస్‌ని చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. కొన్నిసార్లు స్క్రిప్ట్‌లు మనకు విరుద్ధంగా ఉంటుంది. నటనను ఒక కళగా భావించి, అదే సమయంలో ఉద్యోగంగా భావించే వృత్తిపరమైన నటిగా కొన్ని సన్నివేశాలను చేయవలసి వస్తుంది. ఢిల్లీ సుల్తాన్‌లో క్రూరమైన వైవాహిక అత్యాచారాన్ని చిత్రీకరించే సన్నివేశం ఉంది. వైవాహిక అత్యాచారం వంటి తీవ్రమైన సమస్యలను మీడియాలో చాలా మంది “శృంగార సన్నివేశం “గా అభివర్ణించడం నాకు బాధ కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు ప్రస్తుతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను చిన్న విషయంగా భావించవచ్చు. కానీ సోషల్ మీడియాలో కొందరు నన్ను విమర్శించడం బాధిస్తోంది. ఇలాంటి వాళ్లకు సోదరీమణులు, కుమార్తెలు ఉంటారు. వాళ్లు తమ నిజ జీవితంలో ఎప్పటికీ అలాంటి బాధను ఎదుర్కొవద్దని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. మహిళలపై ఇలాంటి క్రూరత్వం, హింస అనే ఆలోచన చాలా అసహ్యకరమైనదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో నటీనటులకు అసౌకర్యం కలగకుండా చిత్రబృందం ఎంతో శ్రమిస్తుంది. ఎంతో ఫ్రొఫెషనల్‌గా కూడా ఉన్నారు. నటిగా నేను ఆ పాత్రకు న్యాయం చేయాలనుకుంటాను. నేను చేసే మహాలక్ష్మి, హనీ, సంజన వంటి ఏ పాత్రలోనైనాన సత్తా చాటాలనే ప్రయత్నిస్తానని ట్వీట్లో మెహ్రీన్ తెలిపింది.