»Tiger Nageswara Rao Censor Complete This Is The Final Run Time
‘Tiger Nageswara Rao’ సెన్సార్ కంప్లీట్.. ఫైనల్ రన్ టైం ఇదే!
మాస్ మహారాజా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ టైగర్ నాగేశ్వర రావు పై భారీ అంచనాలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
'Tiger Nageswara Rao' censor complete.. This is the final run time!
Tiger Nageswara Rao: రవితేజ చేసిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్‌కు సర్వం సిద్దమైంది. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రిలీజ్ టైం దగ్గర పడడంతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది టైగర్ నాగేశ్వర రావు. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ అందించింది. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్‌గా ఉందని తెలుస్తోంది. సినిమా రన్ టైం వచ్చేసి మూడు గంటల ఒక నిమిషం లాక్ చేశారు.
ఇప్పటికే టైగర్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ 38 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. వరల్డ్ వైడ్‌గా 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో టైగర్ నాగేశ్వరరావు బరిలోకి దిగబోతోంది. మాస్ రాజా కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. అలాగే హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా నిలిచింది. ఖచ్చితంగా ఈ సినిమా మాస్ రాజా గత సినిమాల రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి.. భారీ ఓపెనింగ్స్‌తో పాటు.. పాన్ ఇండియా స్టార్డమ్ ఇస్తుందని రవితేజ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ సినిమాతో మాస్ రాజా రికార్డుల వేట మామూలుగా ఉండదని అంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సిస్టర్ నుపుర్ సనన్ మరియు గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు.. జీవిప్రకాశ్ సంగీతాన్ని అందించాడు. మరి టైగర్ నాగేశ్వర రావు రవితేజకు పాన్ ఇండియా రేంజ్లో ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.