Prabhas: ప్రభాస్ ‘స్పిరిట్’ మ్యూజిక్ డైరెక్టర్ అతనే?
బాహుబలి తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు ప్రభాస్. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో 'స్పిరిట్' సినిమాను అనౌన్స్ చేశాడు. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ లాక్ అయినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కెతో పాటు మారుతి సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకమైన జానర్‌తో తెరకెక్కుతున్నాయి. ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపించబోతున్నాడు డార్లింగ్. ఇటీవల ఆదిపురుష్‌లో శ్రీరాముడిగా కనిపించగా.. సలార్‌లో రాక్షసుడిగా, ప్రాజెక్ట్ కెలో సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు. ఇక మారుతి సినిమాలో వింటేజ్ డార్లింగ్‌ను చూడబోతున్నాం. ఆ తర్వాత చేయబోయే స్పిరిట్ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ‘రా’ క్యారెక్టర్ చేయబోతున్నాడు ప్రభాస్. ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే బాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’తో సత్తా చాటాడు సందీప్. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోలు ఈ యంగ్ టాలెంట్‌తో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. త్వరలోనే యానిమల్ సినిమాతో సంచలనాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిపోయిన వెంటనే.. స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించబోతున్నట్లు సమాచారం.
అర్జున్ రెడ్డి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్.. యానిమల్ సినిమాకు కూడా సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నట్లు టాక్. దాంతో నెక్స్ట్ ‘స్పిరిట్’కు ఈయన మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫైనల్ అయినట్టు టాక్. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఇక ‘స్పిరిట్’ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అప్పటి వరకు ప్రభాస్ ఫ్రీ అయిపోనున్నాడు. మరి స్పిరిట్‌తో సందీప్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.