»Abhishek Bachchan Cheated Aishwarya Rai Fake Ring Love Propose
Abhishek bachchan:ఐశ్వర్యను మోసం చేశాడా?
మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఎందరో అందాలు వరించినా..మిస్ యూనివర్స్ అనగానే గుర్తుకు వచ్చేది నటి ఐశ్వర్యరాయ్. నవంబర్ 1, 1973న పుట్టిన ఈ బ్యూటీకి నేటితో 50 ఏళ్లు నిండాయి. నిజానికి ఐశ్వర్యను చూస్తే ఆమెకు ఈరోజు 50వ పుట్టినరోజు అంటే నమ్మడం కష్టమే. వయసు పైబడినా ఇప్పటికీ అదే అందంతో మెస్మరైజ్ చేస్తోంది.
abhishek bachchan cheated aishwarya rai fake ring love propose
నటి ఐశ్వర్య(aishwarya rai) తన ప్రేమ వ్యవహారాలతో పాటు తన సినీ కెరీర్‌కు సంబంధించి వార్తల్లో నిలిచింది. ఇది నేటికీ చర్చనీయాంశమైంది. సల్మాన్ ఖాన్‌తో ఆమె వివాదాస్పద సంబంధం నుంచి అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకోవడం వరకు ఐశ్వర్య వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో ఉండేది. సల్మాన్ ఖాన్ ఇప్పటికీ సింగిల్‌గా ఉండటానికి ఐశ్వర్యే కారణమని నమ్మేవారు కూడా ఉన్నారు. ఈ ప్రేమకథతో పాటు ఐశ్వర్య పేరు కూడా వివేక్ ఒబెరాయ్‌తో ముడిపడి ఉంది. ఐశ్వర్య-వివేక్ ఒబెరాయ్ ల ప్రేమాయణం ఎంత ఇంట్రస్టింగ్ గా ఉంటుందో ఐశ్వర్య-సల్మాన్ ల ప్రేమ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనేవారు. తక్కువ కాలమే అయినా అప్పట్లో బాలీవుడ్లో మంచి హాట్ టాపిక్‌గా ఉండేది.
ఇన్ని గాసిప్స్ ఉన్నప్పటికీ నటి ప్రస్తుతం అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో సంతోషంగా జీవిస్తోంది. ఆమె 50వ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఇంటర్నెట్ లో ఓ వార్త వైరల్ గా మారింది. అదేంటంటే న్యూయార్క్‌లో ఐశ్వర్యకు అభిషేక్ బచ్చన్ ప్రపోజ్ చేశాడట. అయితే ఆ సమయంలో నకిలీ ఉంగరంతో ప్రపోజ్ చేయడం గమనార్హం. అవును. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాలీవుడ్ ఉత్తమ జంటలలో ఒకరిగా పరిగణించారు. 8 ఏళ్ల తర్వాత ఈ జంట ‘గులాబ్-జామూన్’లో కలిసి కనిపించనున్నారు. ఈ పర్ఫెక్ట్ జంట గురించి మాట్లాడుతూ, ఐష్ ఓసారి ఓ ఇంటర్వ్యూలో మా రిలేషన్షిప్లో బోర్డమ్ లేదని చెప్పింది. 2007లో మణిరత్నం ‘గురు’ సెట్స్‌లో అభిషేక్ నకిలీ ఉంగరంతో ఐష్‌కి ప్రపోజ్ చేశాడు. ఈ ఉంగరాన్ని షూటింగ్లో ఉపయోగిస్తారు. ఫేక్ అని తెలిసినా ఐశ్వర్యకి కోపం రాలేదు. అభిషేక్(abhishek bachchan) ప్రపోజల్ ఐష్ కి బాగా నచ్చిందట. ఈ విషయాన్ని ఆమె అప్పుడు చెప్పగా, ఇప్పుడు వైరల్ అవ్వడం విశేషం.
అభిషేక్, ఐశ్వర్య ప్రేమలో పడటానికి ముందు చాలా కాలంగా ఒకరికొకరు తెలుసు. వీరిద్దరూ 2000లో వచ్చిన ధై అక్షర ప్రేమ్ కే సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. దీని తర్వాత 2003లో తెరకెక్కిన ‘కుచ్ నా కహో’ చిత్రంలో ఇద్దరూ కలిసి పనిచేశారు. అప్పట్లో ఇద్దరూ స్నేహితులు, తరచూ కలుసుకునేవారు. నివేదికల ప్రకారం 2005 చిత్రం ‘బంటీ ఔర్ బబ్లీ’లోని ప్రసిద్ధ పాట ‘కజరారే-కజరారే…’ షూటింగ్ సమయంలో అభిషేక్, ఐశ్వర్య ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారు. ఆ తర్వాత 2006-07లో వీరిద్దరూ కలిసి ‘ఉమ్రావ్ జాన్’, ‘గురు’, ‘ధూమ్-2’ చిత్రాల్లో నటించారు. ఈ కాలంలో ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడిపారు. ఆ క్రమంలోనే వారిద్దరూ 14 జనవరి 2007న నిశ్చితార్థం చేసుకుని తర్వాత ఏప్రిల్ 20, 2007 పెళ్లి(marriage) చేసుకున్నారు.