KDP: నెల్లూరు జిల్లాలో స్పెషల్ కలెక్టర్కు పీఏగా పనిచేసిన ఏ. మురళిని రాష్ట్ర ప్రభుత్వం కడప నూతన ఆర్డీవోగా నియమించింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఆర్డీవో జాన్ ఎర్విన్ బదిలీ కావడంతో, సోమవారం ఉదయం మురళి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.