TG: ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఛలో అసెంబ్లీకి బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటూ ఛలో అసెంబ్లీకి బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల వద్ద పోలీసులను మోహరించారు. బయటకు వచ్చిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.