W.G: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్, డెమోన్ పవన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల ఆయన తండ్రి క్యాన్సర్తో బాధపడుతూ కన్నుమూశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా సోమవారం మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకులోని పవన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.