NLR: పొదలకూరులో ఆదివారం మాజీ మంత్రి కాకాణి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం ధరలు రోజురోజుకూ తగ్గుముఖం పట్టడం పట్ల రైతులలో ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. ధాన్యం ధర ఇప్పటికే దాదాపు పుట్టి (850 కేజీలు) రూ.4 వేల మేర పడిపోవడం రైతులకు తీరని నష్టమన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.