TG: అసెంబ్లీ ముట్టడికి ఇవాళ బీజేపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారంటీల చట్టబద్ధతను విస్మరించారంటూ నిరసన తెలుపనున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీకి వెళ్లే మార్గాల్లో పోలీసులు మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలర్ట్ అయ్యారు. పలువురు బీజేపీ నేతలను ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు.