ASR: మహారాష్ట్ర పూణేలో ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలలో ఆంధ్రా జట్టు మూడవ స్థానం సాధించింది. ఈ జట్టులో అల్లూరి జిల్లా సీలేరు జడ్పీహెచ్ పాఠశాల పీడీ చిన్ని విధులు నిర్వహిస్తున్నారు. కాగా జట్టు గెలవడంలో ఆల్ రౌండర్‌గా ప్రతిభచూపిన పీడీ చిన్నిని ప్రత్యేకంగా గౌరవించారు.