VSP: సీతమ్మధార రైతుబజార్ వద్ద పారిశుద్ధ్య నిర్వహణపై చిత్తశుద్ధి లోపం కనపడుతుంది. బజార్ గేట్ వద్ద రోడ్డు మీద పేరుకుపోయిన చెత్తవ్యర్థాలను సకాలంలో తొలగించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతుందని మార్కెట్కు వెళ్లే వినియోగదారులు తెలిపారు. పేరుకుపోతున్న చెత్త వలన దోమల బెడద ఎక్కువవుతుందని స్థానికులు అంటున్నారు. సంభందిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.