WGL: మామునూరు మండలలోని బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో జనగణన–2027 శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ డా. సత్య శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గణాంకాల సేకరణ ఖచ్చితంగా జరగాలని తెలిపారు. ప్రతి వివరాన్ని బాధ్యతగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. జనగణన విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ కట్టుబాటుతో పనిచేయాలని తెలిపారు.