ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో ఆర్ఆర్ఆర్ హవా నడుస్తోంది. హాలీవుడ్లో దర్శక ధీరుడి పేరు మార్మోగిపోతోంది. ఇటీవలె గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకున్న ఆర్ఆర్ఆర్.. ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉంది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధిస్తే మాత్రం.. చరిత్ర సృష్టించినట్టే. ప్రతి ఒక్క తెలుగుడికే కాదు యావత్ దేశానికే గర్వకారణం. అందుకే రాజమౌళికి మేకింగ్‌కు ఫిదా అయిపోయాడు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. హాలీవుడ్లో సినిమా చెయ్యాలి అనుకుంటే.. మనం మాట్లాడుకుందాం.. అంటూ రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్ ఇచ్చాడు. ఇటివలే జేమ్స్ కామెరాన్ని గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ పార్టీలో మీట్ అయ్యాడు రాజమౌళి. ఈ సంధర్భంగా రాజమౌళితో జేమ్స్ కామెరాన్ ఇంటరాక్షన్ సోషల్ మీడియాను షేక్ చేసింది.
తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్.. ఈ ఇద్దరు దర్శక దిగ్గజాల కన్వర్జెన్స్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో దాదాపు నాలుగు నిమిషాల పాటు మాట్లడుకున్నారు. జేమ్స్.. జక్కన్న పై ప్రశంసల వర్షం కురిపించాడు. స్టొరీని రివీల్ చేసిన విధానం, ఎమోషన్, ఎలివేట్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ రోజు మీరు టాప్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పుకొచ్చాడు. ఇక జేమ్స్ కామరూన్ వైఫ్ ‘సూజీ’ కూడా రాజమౌళికి ఫిదా అయిపోయింది. ‘జేమ్స్ మీ సినిమాని రెండు సార్లు చూశాడు.. ఫస్ట్ టైమ్ తను మాత్రమే చూసి, సెకండ్ టైమ్ నాతో కలిసి చూశాడు.. కంగ్రాట్స్.. అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. ఈ క్రమంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాని 320 రోజుల్లో కంప్లీట్ చేశానని చెప్పాడు. ఇక టోటల్ ఇంటరాక్షన్‌లో.. జేమ్స్ కామెరాన్, రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.