BPT: ఉప్పుటూరు గ్రామంలో టీడీపీ మైనారిటీ సెల్ సీనియర్ నాయకుడు హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి, రంజాన్ నెల యొక్క పవిత్రతను వివరించారు. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత పెంపొందాలని ఆయన ఆకాంక్షించారు.