RR: ఈనెల 29న కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామంలో జరిగే మహనీయుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MRPS రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.