కోనసీమ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో జరిగిన జనసమీకరణ సమావేశంలో పరిశీలకునిగా ఆయన పాల్గొని, ప్రసంగించారు. ఈనెల 23న అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.