NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం విడవలూరు మండలంలో పర్యటించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు మండలంలోని వావిళ్ల సెంటర్ నుంచి ఎస్టీ కాలనీ వరకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని గమనించి, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.