WNP: గ్రామ అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల ఆరోగ్యము అంతే ముఖ్యమని రంగాపురం సర్పంచ్ హేమలత కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం గ్రామంలో అపోలో, సరోజినీ, భారత్ కంటి ఆసుపత్రుల సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వృద్ధులు, చిన్నారుల సౌకర్యార్థం గ్రామంలోనే పరీక్షలు జరిపించి మందులు పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.