TG: నీరు మానవ మనుగడకు ప్రాణాధారమని మంత్రి సీతక్క తెలిపారు. నీటి దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి నీటి బొట్టు విలువైనదని, నీటి వృథా కొనసాగితే భవిష్యత్లో తీవ్ర సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. భూగర్భ జలాల పెంపుకోసం ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ప్రజలకు సూచించారు. చెట్లు పెంచడం, చెరువులను సంరక్షించి నీటి వనరులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.