NLG: కట్టంగూరు మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గొవ రోజు ఆదివారం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు. లోక కల్యాణార్థం ఆలయ ప్రాంగణంలో శ్రీరామ హోమం వైభవంగా జరిగింది.