NRPT: నారాయణపేటలో ఆశా కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న లెప్రసీ సర్వే బిల్లులు చెల్లించే వరకు కొత్త సర్వేలు నిర్వహించబోమని ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి, సీఐటీయూ కార్యదర్శి బలరాం స్పష్టం చేశారు. బుధవారం వైద్య శాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తూ, తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.