ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ సాయంత్రం కేంద్రమంత్రులతో అత్యున్నత సమావేశం జరగనుంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల లభ్యతపై చర్చించనున్నారు. అదేవిధంగా ఇంధన భద్రతకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి సారిస్తోంది. పరిశ్రమలు, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు అన్ని అవకాశాలనూ కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.