»Samantha Sent A Special Gift To Designer Pritam The Post Went Viral
Samantha: ఓ స్పెషల్ పర్సన్‌కు అదిరిపోయే గిఫ్ట్ పంపిన సామ్
తెలుగు నటి సమంతా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. కొన్ని సార్లు ట్రోల్ అవుతుంది. మరికొన్ని సార్లు ట్రెండ్ అవుతుంది. తాజాగా ఓ స్పెషల్ పర్సన్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తాను చేసిన ఈ పని గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samantha sent a special gift to designer Pritam.. The post went viral
Samantha: టాలీవుడ్లో బిజీగా ఉన్న హీరోయిన్లలో సమంత(Samantha) పేరు ముందు వరుసలో ఉండేది. కెరియర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది. తరువాత కొన్ని కారణాల వలన తన మ్యారేజ్ లైఫ్ నుంచి బయటకు వచ్చేసింది. అదే సమయంలో సమంత మయోసైటీస్ వ్యాధితో బాధ పడింది. ఇప్పుడిప్పుడే మెల్లిగా కోలుకుంటుంది. ఈ మధ్యలో తాను నటించిన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. దీంతో సినిమాలకు కొంత కాలం గ్యాప్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సినిమాలకు దూరం అయినా తన సోషల్ మీడియాతో అభిమానులకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది సామ్.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ డిజైనర్ ప్రీతమ్(Pritam)కు సమంత గిఫ్ట్ ఇచ్చిందంటా. అదే విషయాన్ని సమంత తన స్టోరీలో పెట్టింది. దానికి స్పందించిన ప్రీతమ్ ఒక చెవి కుట్టించుకుందాం అనుకుంటే, సమంత రెండు చెవులు కుట్టించిందని తెలిపాడు. ఇక తన చెవులకు పెట్టుకోవడానికి రింగ్స్ కూడా సమంతనే బహుమతిగా ఇచ్చినట్లు రాసుకొచ్చాడు. దాంతో పాటు చెవులు కుడుతున్నప్పుడు సరదాగా ఉందని రాశాడు. దానికి సమంత స్పందించింది.
ప్రీతమ్ చెవులు కుడుతున్నప్పుడు భయపడ్డాడని దానికి సంబంధించిన మరో వీడియోను తన స్టోరీలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. గతంతో ప్రీతమ్ మీద కాలు వేసిన ఒక ఫోటోను సమంత తన ఇన్స్టాగ్రామ్(Instagram)లో షేర్ చేసింది. ఆ ఫోటో తెగ వైరల్ అయింది. వాళ్లిద్దరు రిలేషన్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. వెంటనే సమంత ఆ ఫోటోను డిలీట్ చేసింది. కానీ పుకార్లు ఆగలేదు. తరువాత ప్రీతమ్ స్పందించాడు. సమంతను తాను అక్క అని పిలుస్తానని..ఆ విషయం నాగచైతన్యకు కూడా తెలుసని చెప్పాడు. అది జరిగిన కొన్నాళ్లకు వీరిద్దరు విడిపోయారు. అయితే వీరి డివోస్ కు కారణం ఏంటన్నది మాత్రం కచ్చితంగా తెలియదు.