»Aamir Khan Daughter Ira Khan Marriage Date Fixed On January 3 2024
Aamir Khan daughter: ఇరాఖాన్ పెళ్లి డేట్ ఫిక్స్
అమీర్ ఖాన్ కుమార్తె ఇరాఖాన్(Ira khan) మ్యారేజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్సైంది. ఆమె ప్రియుడు నూపూర్(Nupur)తో జనవరి 3, 2024న జరగనున్నట్లు అమీర్ ఖాన్ ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇరా, నుపుర్ ముంబైలో నిశ్చితార్థం చేసుకున్నారు.
Aamir Khan daughter Ira khan marriage date fixed on january 3, 2024
ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూతురు(Aamir Khan daughter) ఇరా ఖాన్(Ira khan) పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇరా తన ప్రియుడు నూపుర్ షికారేని జనవరి 3న వివాహం చేసుకోబోతున్నట్లు నటుడు వెల్లడించారు. అమీర్ ఖాన్ కుమార్తె, ఆమె చిరకాల ప్రియుడు నూపూర్(Nupur) నిశ్చితార్థం నవంబర్ 18, 2022న ముంబైలో జరిగింది. నిశ్చితార్థ వేడుకకు అమీర్ మాజీ భార్య కిరణ్ రావు, ఇమ్రాన్ ఖాన్, అశుతోష్ గోవారికర్, ఫాతిమా సనా షేక్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఇప్పటికే ఇరా పెళ్లి కోసం బంగారం షాపింగ్ కోసం ఇద్దరూ బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది చివరి నాటికి వారి పెళ్లి జరగవచ్చని ఊహాగానాలు వినిపిస్తుండగా..అమీర్ ఖాన్ పెళ్లి తేదీపై క్లారిటీ ఇచ్చారు.
తన కూతురి పెళ్లి సందర్భంగా తాను చాలా భావోద్వేగానికి లోనవుతున్నానని అమీర్ అన్నారు. తన కుమార్తె ఎంచుకున్న అబ్బాయి నుపుర్. అతను అందమైన మంచి అబ్బాయి. ఇరా డిప్రెషన్‌తో పోరాడుతున్నప్పుడు, అతను ఆమెతో ఉన్నాడని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. అతను నిజంగా ఆమెకు అండగా నిలిచి మానసికంగా ఆమెకు మద్దతునిచ్చిన వ్యక్తి. ఆమె అతన్ని ఎంపిక చేసుకున్నందుకు తాము సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు. వారు కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారని, వారిద్దరూ నిజంగా ఒకరినొకరు చూసుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఫిల్మీ డైలాగ్ కావచ్చు. కానీ నూపూర్ తనకు ఒక కొడుకులా అనిపిస్తాడని వెల్లడించారు. నూపూర్ తమ కుటుంబంలో భాగమని, అతని తల్లి ప్రీతమ్ జీ ఇప్పటికే మా కుటుంబంలో భాగమైన వ్యక్తి అని భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఇరా అమీర్ ఖాన్(Aamir Khan)కి అతని మొదటి భార్య రీనా దత్తాకు రెండవ సంతానం. అమీర్‌కు జునైద్ ఖాన్ తో మొదటి వివాహం జరుగగా వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.