ద్రావిడ ఉద్యమ పితామహుడు, హేతువాది తందై పెరియార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాకి తమిళనాడు సీఎం స్టాలిన్, టీవీకే అధినేత విజయ్ నివాళులర్పించారు. సమానత్వాన్ని పరిరక్షించడమే పెరియార్‌కు చెల్లించే కృతజ్ఞత అని స్టాలిన్ అన్నారు. మరో వైపు విజయ్ మాట్లాడుతూ.. పెరియార్ చూపిన సమానత్వ మార్గంలో పయనించి సామాజిక న్యాయం పొందటానికి ప్రతిజ్ఞ చేద్దామంటూ పిలుపునిచ్చారు.