ఒడిశా చాంద్బలిలో పదేళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై సీఎం మోహన్ మాఝీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి ఆత్మకి శాంతి కలగాలని జగన్నాథుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.