»Samyuktha Menon Samyuktha Menon In Peekallothu Love When Is The Wedding
Samyuktha Menon: పీకల్లోతు ప్రేమలో సంయుక్త మీనన్.. పెళ్లి ఎప్పుడంటే?
స్టార్ హీరోయిన్లు రష్మిక, పూజా హెగ్డేతో పాటు.. యంగ్ బ్యూటీస్ కృతి శెట్టి, శ్రీలీల రేంజ్లో వరుస ఆఫర్స్ అందుకుంటోది సంయుక్త మీనన్. అయితే.. ఇప్పటి వరకు అమ్మడి ప్రేమ వ్యవహారం పెద్దగా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో ఉంది.. పెళ్లికి కూడా రెడీ అవుతోందనే న్యూస్ వైరల్‌గా మారింది.
Samyuktha Menon: శ్రీలీల, కృతి శెట్టి రేంజ్లో టాలీవుడ్లో వినిపిస్తున్న మరో పేరు సంయుక్త మీనన్. ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవలేదు. భీమ్లా నాయక్‌లో రానా సరసన షార్ట్ లెంగ్త్ క్యారెక్ట్ చేసింది. ఆ తర్వాత బింబిసారలోను కళ్యాణ్ రామ్‌తో చాలా తక్కువగా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత ధనుష్ ‘సార్’ సినిమాతో అమ్మడికి మంచి పేరొచ్చింది. ఆ వెంటనే సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది సంయుక్త. ఈ సినిమాతోనే అమ్మడు గ్లామర్ డోస్ పెంచేసింది. ప్రస్తుతం థియేటర్లో డెవిల్ సినిమాతో అలరిస్తోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ సరసన బింబిసార తర్వాత రెండోసారి నటించిన డెవిల్ సినిమా ఓకె అనిపించుకుంది. దీంతో సంయుక్త మంచి జోష్‌లో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ క్యూట్ బ్యూటీ పీకల్లోతు ప్రేమలో ఉందనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. గతంలో త్రివిక్రమ్, సంయుక్త మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే గాసిప్స్ వినిపించాయి. మాటల మాంత్రికుడి వల్లే అమ్మడికి అవకాశాలు వస్తున్నాయనే రూమర్ ఉంది. కానీ ఎప్పుడు కూడా ఫలానా వారితో ప్రేమలో ఉందనే మాట వినిపింలేదు. లేటెస్ట్ రూమర్ ప్రకారం.. సంయుక్త ప్రస్తుతం తన స్నేహితుడితో ప్రేమలో ఉందట. ఈ ఏడాది తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది చివర్లో సంయుక్త పెళ్లి పీఠలెక్కనుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పెళ్లికి పనులు కూడా మొదలు పెట్టిందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. పెళ్లి కారణంగానే సంయుక్త కొత్త సినిమా ప్రాజెక్టులకు కమిట్ అవడం లేదని అంటున్నారు. మరి సంయుక్త తన బాయ్ ఫ్రెండ్‌ని ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి.