»The Fast Spreading Jn 1 Corona What Are The Total Cases
JN. 1 Corona: వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. మొత్తం కేసులెన్నంటే?
కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. మొత్తం దేశంలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయో ఇండియన్ సార్స్-కోవ్2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది.
The fast spreading JN. 1 Corona.. What are the total cases?
JN. 1 Corona: దేశవ్యాప్తంగా కరోనా(Corona) వేగంగా వ్యాపిస్తోంది. కొత్త వేరియంట్ జేఎన్.1(JN.1) కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 312 కేసులు గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది. వీటిలో 47శాతం కేసులు కేరళలోనే నమోదు అయినట్లు తెలిపింది. జేఎన్.1 వేరియంట్‌ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికి ప్రమాదం తక్కువే అని తెలిపింది. అలానే ప్రజలు తేలికగా తీసుకోవద్ది, కొవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొంది.
కొవిడ్ జేఎన్.1 కేసులు అత్యధికంగా కేరళలో (147), గోవా (51), గుజరాత్ (34), మహారాష్ట్ర (26), తమిళనాడు (22), దిల్లీ (16), కర్ణాటక (ఎనిమిది), రాజస్థాన్ (ఐదు), తెలంగాణ (రెండు), ఒడిశాలో ఒక కేసు నమోదు అయినట్లు ఇన్సాకాగ్ పేర్కొంది. మొత్తం కేసుల్లో 279 డిసెంబర్లో, 33 కేసులు నవంబర్‌లో బయటపడ్డాయి. మరోవైపు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 573 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4565కు చేరుకున్నాయి.