Special Trains: తెలుగు ప్రజలకు సంక్రాంతి(Sankranti) పెద్ద పండుగ అని అందరికి తెలిసిందే. అందుకే ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే(Railway) 32 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. సోంత గ్రామాలకు వెళ్లే వారి కోసం నిర్ధిష్ట మార్గాల్లో ఈ రైళ్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్-బ్రహ్మపుర్, బ్రహ్మపుర్-వికారాబాద్, విశాఖపట్నం-కర్నూలు సిటీ, శ్రీకాకుళం-వికారాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-నర్సాపూర్ రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. జనవరి 7వ తేదీ నుంచి జనవరి 27 మధ్య వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు జరగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
చదవండి:Hyderabad : నగరవాసులకు అలర్ట్.. రేపు అంతా నీటి సరఫరా బంద్