AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి అన్నీ రేషన్ దుకాణాల ద్వారా రాయితీపై గోధుమపిండి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్డుకు ఒక కిలో చొప్పున రూ.20కు గోధుమపిండిని అందిస్తామని పౌరసరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు వెల్లడించారు. బహిరంగ మార్కెట్ ధరతో పోలిస్తే తక్కువకే ఇస్తామన్నారు.