SKLM: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని క్రైస్తవులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.