NZB: పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 481 మంది లబ్ధిదారులకు రూ. 4.81 కోట్ల షాదీ ముబారక్ చెక్కులు, అలాగే 187 మంది లబ్ధిదారులకు రూ. 1.87 కోట్ల కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.