వాజ్‌పేయి.. భారత మాజీ ప్రధాని. నైతిక రాజకీయాలకు వన్నే తెచ్చిన అజాతశత్రువు. ఒక్క ఓటుతో ప్రధాని పదవిని పోగొట్టుకున్న నేత. కార్గిల్ యుద్దంలో పాక్‌పై గెలిచి భారత్‌కు విజయాన్ని అందించారు. రాజస్థాన్‌లో అణు పరీక్షలు నిర్వహించి భారత్‌ను అణ్వాయుధ దేశంగా మార్చారు. ఎన్ని రంగాల్లో సంస్కరణలు తెచ్చినందుకు 2015లో ఆయనకు భారతరత్న వరించింది.