MBNR: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ సవాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు.