KMM: బనిగండ్లపాడు కట్టలేరు బ్రిడ్జి వద్ద యన్నం వెంకట్రామిరెడ్డి ఆత్మహత్య ఘటన ఉత్కంఠ రేపుతోంది. మృతుడి వద్ద సూసైడ్ నోట్ లభ్యమైందని కుటుంబ సభ్యులు వెల్లడించడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఆ లేఖను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు స్థానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ఆసుపత్రికి తరలించారు.