ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్యంపై పర్యవేక్షణ లోపం గర్భిణులను ప్రైవేటు బాట పట్టిస్తోంది. గత ఏడాది సర్కారు ఆసుపత్రుల్లో కేవలం 6,316 ప్రపవాలే జరగగా ప్రైవేటులో ఆ సంఖ్య 7,789కి చేరడంతో అధికారుల నిర్లక్షానికి దారితీస్తోంది. వీటిలో అధిక శాతం సిజేరియన్లే కావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని పలువురు వాపోతున్నారు.