TG: అంగన్వాడీలకు కొత్త ఫోన్లు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయించింది. 38 వేలకు పైగా శామ్సంగ్ ఫోన్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. 10 రోజుల్లో సీఎం రేవంత్ వాటిని అందజేయనున్నట్లు తెలుస్తోంది. 4G ర్యామ్, 64GB మెమొరీ సామర్థ్యం ఉన్నవాటిని ఇవ్వనున్నారు. అంగన్వాడీ టీచర్ ప్రతిరోజు ఫోన్లో పోషణ్ ట్రాకర్ యాప్లో 14 రకాల వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది.