మేషం
సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి.
వృషభం
మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది.
మిథునం
మీరు చేసే పనులలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. అనవసర భయానికి లోనవుతారు.వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధవహిస్తారు.
కర్కాటకం
మీరు చేసే ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. మీ పనితీరుతో మీ పై అధికారుల మనసులను గెలుస్తారు. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.
సింహం
కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది.
కన్య
వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి జరుగుతుంది.ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు.ముఖ్యమైన పనులను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి.
తుల
రాజకీయరంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి.శుభవార్తలు వింటారు. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించటం మంచిది.
వృశ్చికం
మీరు చేసే ఉద్యోగంలో శ్రద్దగా పనిచేయాలి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో శత్రుత్వం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.
ధనుస్సు
శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి.
మకరం
మీరు చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా ముందుచూపుతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది.
కుంభం
మీరు చేపట్టిన పనులలో విజయావకాశాలు ఉన్నాయి.అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.
మీనం
శుభ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు.