SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో కాజి పల్లి – బొల్లారం డివిజన్ రహదారి సీసీ పనులు పూర్తయ్యాయి. గతంలో కంకర, గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు సీసీ రోడ్డు నిర్మాణంతో ప్రయాణం సుఖంగా, సౌకర్యవంతంగా మారింది. రాకపోకలు సులభమవడంతో స్థానిక వాహనదారులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.