BHPL: మొగుళ్ళపల్లి మండలంలో బావిలో పూడిక తొలగించే క్రమంలో క్రేన్ పడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను శనివారం రాత్రి మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు తదితరులు పాల్గొన్నారు.