SDPT: జగదేవపూర్ మండలం తీగుల్ నర్సాపూర్లోని కొండపోచమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మల్లన్న క్షేత్రం నుంచి నేరుగా ఇక్కడికి భక్తులు వస్తుండటంతో తీగుల్ నర్సాపూర్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో దర్శనానికి సమయం పడుతుంది అని అన్నారు.