PPM: కురుపాంలో ఆర్టీసీ కాంప్లెక్స్ కోసం గతంలో లక్షల రూపాయల ప్రజాధనంతో భవనం నిర్మించినప్పటికీ, ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాన్ని వినియోగంలోకి తీసుకొస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.