HYD: నగర పరిధిలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2026లో ఇప్పటి వరకు హైదరాబాద్లో 393, రంగారెడ్డి 236, మేడ్చల్ 177 అగ్ని ప్రమాదాలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. కోట్లలో ఆస్తి నష్టం జరుగుతుంది. అయితే.. HYD నగరంలో ఫైర్ సేఫ్టీ లేని కమర్షియల్ భవనాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం లేదని, నిబంధనలు కఠినంగా అమలు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.