NGKL: కల్వకుర్తి మండలంలోని పలు రైతు వేదికలు మందుబాబులకు నిలయంగా మారాయి. ఊరు బయట ఉండటంతో రాత్రివేళల్లో మద్యం సేవిస్తూ, ఖాళీ సీసాలను అక్కడే పడేస్తున్నారు. వాకింగ్‌కు వెళ్లే వారికి ఈ దృశ్యాలు దర్శనమిస్తుండటంతో వాకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాల్సిన వేదికలు ఇలా మారుతుండటంపై గ్రామస్థులు మండిపడుతున్నారు.